సకల జనుల సమ్మె ఐడియా అతనిదే..బిల్ పాస్ అయ్యేదాకా టెన్షన్ పడ్డాం

సకల జనుల సమ్మె ఐడియా అతనిదే..బిల్ పాస్ అయ్యేదాకా టెన్షన్ పడ్డాం

తెలంగాణ కావాలనే తీవ్రమైన పోరాటం ప్రజల చైతన్య స్థాయికి సంకేతం అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై గ్రామాల్లోని ప్రజలకు స్పష్టతం ఉండేదని చెప్పారు. మూడు సందర్భాల్లో ముగ్గురు వ్యక్తులను తనను ఇన్ స్పైర్ చేశారని..తన బాధ్యతను గుర్తు చేశారని కోదండరాం తెలిపారు. తెలంగాణ బిల్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఆందోళనలో ఉన్నామన్నారు. బిల్ పాస్ అవుతుందా లేదా అన్న టెన్షన్ పడ్డామని..కాకపోతే ఎన్నికలు దాటాలి..ఎన్నికలు అయితే బిల్ మళ్లీ తెస్తారో లేదో అన్న ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ బిల్ పాస్ అయినట్లు ప్రకటన వచ్చిందో అప్పుడు అందరి కళ్లలో నీళ్లు తిరిగాయని..అ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. 

సకల జనుల సమ్మెకు ఐడియా అతనిదే...

తెలంగాణ ఉద్యమంలో అనేక ఊర్లు తిరిగామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఓ మీటింగ్ కు వెళ్లినప్పుడు ఓ కళాకారుడు తనతో మాట్లాడారని..తెలంగాణ రావాలంటే అన్ని స్థంభించి పోవాలని..పరిపాలన సాగొద్దు..ఆఫీసులు బంద్ కావాలి..రైళ్లు, బస్సులు నడవొద్దు..అలా అయితే తెలంగాణ వస్తుందని చెప్పాడన్నారు. 

ఆ తర్వాత భువనగిరిలో ఒక రిపోర్టర్.. తాము..మేం ఏం చేయమన్నా చేస్తం కానీ పాలన ఆగిపోవాలి..అని  చెప్పాడని..అక్కడి నుంచి సకల జనుల సమ్మెను ప్లాన్ చేశామని కోదండరాం వెల్లడించారు.  స్టీరింగ్ కమిటీలో సకల జనుల సమ్మెను ప్రతిపాదించామన్నారు. అయితే కేసీఆర్ ఈ సమ్మెలో సకల జనులు  పాల్గొంటారా అని అన్నారని..అదే పేరు బాగుంటుందని పెట్టామని వివరించారు. 

మిలియన్ మార్చ్..ఎలా వచ్చింది..

మిలియన్ మార్చ్ను విదేశాల్లో జరిగిన ఉద్యమాల స్పూర్తితో నిర్వహించామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.  అరబ్ స్క్రింగ్ ఉద్యమాల నుంచి స్పూర్తి పొంది మిలియన్ మార్చ్ ను నిర్వహించామన్నారు. 

సాగరహారం..

అమెరికాలోని వాషింగ్టన్లో ఓ ఉద్యమం జరిగిందని..అక్కడ వాళ్లందరూ కూర్చోని టెంట్లు వేసుకుని నిరసన తెలిపినట్లు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. అదే మాదిరిగా మనం కూడా  ట్యాంక్ బండ్ దగ్గర నిరసన తెలుపుదాం అని అనుకున్నామని..అక్కడే కూర్చోవాలి...నిరసన తెలపాలి..తెలంగాణ ఇచ్చేదాక లేవొద్దు అని సాగరహారం చేపట్టామన్నారు. 

బయట జరిగిన ఉద్యమాల స్పూర్తి..జనం ఇచ్చిన ఆలోచనలు..ఎలాగైనా కొట్లాడాల్సిందే..తెలంగాన వచ్చేదాక ఆగొద్దని..ప్రజల్లో ఉన్న అభిప్రాయం..ఈ ఒత్తిడే తమ మీద ఉందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వీటన్నింటి కారణంగా ఒక్కో కార్యక్రమాన్ని డిజైన్ చేశామని...వాటిపై నమ్మకం కుదిరాక...దానికి మంచి పేరు పెట్టినట్లు చెప్పారు. అందులో అందరిని భాగస్వామ్యాన్ని చేశామని..ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి...అందరి అభిప్రాయాలకు సమాన గౌరవం ఇచ్చామన్నారు. ప్రజస్వామికంగా వ్యవహరించడం వల్ల కార్యక్రమాలు విజయవంతం అయి తెలంగాణ ఏర్పడిందని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.