రైతు భరోసా ఎగ్గొట్టేందుకే ఎలక్షన్స్ : ఎమ్మెల్యే హరీశ్‌ ‌‌‌రావు

రైతు భరోసా ఎగ్గొట్టేందుకే ఎలక్షన్స్ :  ఎమ్మెల్యే హరీశ్‌ ‌‌‌రావు
  • ఒక్కో మహిళకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 వేలు బాకీ
  • బసవేశ్వర ప్రాజెక్ట్‌‌‌‌ కోసం త్వరలో పాదయాత్ర : ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

నారాయణ్‌‌‌‌ఖేడ్‌‌‌‌, వెలుగు : రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఆదరాబాదరాగా పంచాయతీ ఎలక్షన్స్‌‌‌‌ ప్రక్రియ చేపట్టిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌‌‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్‌‌‌‌ అడ్రస్‌‌‌‌గా మారిందన్నారు. రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతోందని, సన్నవడ్ల బోనస్‌‌‌‌ ఇప్పటివరకు ఇవ్వలేదని, మక్కలు, సోయా కొనుగోళ్లు జరిగినా ఇప్పటివరకు డబ్బులు వారి అకౌంట్లలో జమ కాలేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ. 60 వేలు బాకీ పడిందన్నారు. గత ప్రభుత్వం పండుగకు చీరలు పంపిణీ చేస్తే.. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం మాత్రం ఎన్నికల కోసమే పంపిణీ చేస్తోందన్నారు. తులం బంగారం, నాలుగు వేల పింఛన్‌‌‌‌తో పాటు అనేక పథకాలు అమలు చేయడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్లను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించకపోతే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడుతామని చెప్పారు.

 సమావేశంలో సమావేశంలో భూపాల్‌‌‌‌రెడ్డి, డీసీఎంఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ శివకుమార్, కార్పొరేషన్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌ భిక్షపతి, నాయకులు మోహీద్బాన్, శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌, పరమేశ్వర్, నగేశ్‌‌‌‌, విజయ్‌‌‌‌ బుజ్జి, లక్ష్మిబాయి రవీందర్‌‌‌‌నాయక్‌‌‌‌ పాల్గొన్నారు. అంతకుముందు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులతో కలిసి నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్, సిర్గాపూర్‌‌‌‌లో మల్లన్న జాతరకు హరీశ్‌‌‌‌రావు హాజరయ్యారు.