హైదరాబాద్ సిటీలో భక్తి శ్రద్ధలతో విశాల్ కీర్తన్ దర్శన్

హైదరాబాద్ సిటీలో భక్తి శ్రద్ధలతో విశాల్ కీర్తన్ దర్శన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిక్కుల తొమ్మిదో గురు తేగ్ బహదూర్​మహారాజ్ 350వ షహీద్ దివస్‌‌ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్​స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ‘విశాల్ కీర్తన్ దర్శన్’ (సామూహిక ప్రార్థనలుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సిక్కులు హాజరయ్యారు. కమిటీ చైర్మన్లు హర్పాల్ సింగ్, కాంచన్ సింగ్, అధ్యక్షుడు ప్రతాప్ సింగ్, ఉపాధ్యక్షుడు రాజేంద‌‌ర్ సింగ్, ప్రధాన కార్యదర్శి రంజీత్ సింగ్, సంయుక్త కార్యదర్శి  జగ్జీత్ సింగ్ తరలి వచ్చిన భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు.