- ప్రొఫెసర్ కోదండరామ్
ముషీరాబాద్, వెలుగు: మానవ హక్కులను కాపాడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జాతీయ మానవహక్కుల సంఘం, సామాజిక న్యాయ సంఘం తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మానవ హక్కుల కోసం పోరాటం చేయడం, ఇతరుల స్వేచ్ఛ కోసం కొట్లాడటమేనన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మెహతాబ్దాయ్, ఉపాధ్యక్షుడు దీపక్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు బి. సర్వేందర్, వర్కింగ్ ప్రసిడెంట్ వేణుమాధవ్, రాష్ట్ర కార్యదర్శి శైలేంద్రసింగ్ పాల్గొన్నారు.

