అయోధ్య మీడియేటర్ల ప్రొఫైల్స్

అయోధ్య మీడియేటర్ల ప్రొఫైల్స్

ఢిల్లీ : అయోధ్య మందిర్-మసీద్ వివాద పరిష్కారంపై పూర్తిగా దృష్టి పెట్టామంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ప్యానెల్ ను మధ్యవర్తిత్వం కోసం ఏర్పాటుచేసింది. రిటైర్ట్ జడ్జి ఎఫ్ఎఫ్ కలిపుల్లా ఆధ్వర్యంలో శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచు సభ్యులతో ఈ ప్యానెల్ ఏర్పాటైంది. 4 నెలల్లో సమస్య పరిష్కారంపై స్టేటస్ రిపోర్ట్, 8 నెలల్లో తుది నివేదిక అందించాలనేది సుప్రీంకోర్టు పెట్టిన గడువు. ప్యానెల్ లోని సభ్యుల ప్రొఫైల్స్ ఏంటో తెల్సుకుందాం.

జస్టిస్ FM కలిఫుల్లా :

  • వయసు 68.
  • దివంగత ఎం.ఫకీర్ మొహమ్మద్ కుమారుడు
  • 1975 ఆగస్టులో కెరీర్ ప్రారంభం
  • లేబర్ లా ప్రాక్టిషనర్
  • 2000 ఏడాదిలో మద్రాస్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం
  • 2012 ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి

శ్రీశ్రీ రవిశంకర్ :

  • వయసు 62
  • ఆధ్యాత్మిక గురువు
  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు
  • హింసలేని సమాజం నిర్మిద్దామంటూ ప్రపంచమంతా ఉద్యమం
  • రామ్ మందిర్ సమస్య పరిష్కారానికి కొన్నాళ్లుగా సంప్రదింపులు

శ్రీరాం పంచు :

  • వయసు 69.
  • సీనియర్ అడ్వకేట్ , ప్రముఖ మీడియేటర్
  • మీడియేషన్ చాంబర్స్ వ్యవస్థాపకుడు
  • 2005లో తొలిసారిగా కోర్టు ఆదేశాలతో మధ్యవర్తిత్వ సంస్థ ఏర్పాటు
  • మధ్యవర్తిత్వంపై పుస్తకాలు రాశారు.
  • విజయవంతమైన ప్రముఖ మధ్యవర్తిగా సుప్రీంకోర్టు గుర్తింపు
  • అద్భుతమైన శిక్షకుడిగా గుర్తింపు