హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్లపై కొనసాగుతున్న వివక్షను ప్రభుత్వం తక్షణమే తొలగించాలని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(పీఎంటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ డిమాండ్ చేశారు. సొసైటీ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, విద్యాశాఖ నుంచి నేటికీ ఉత్తర్వులు రాలేదని చెప్పారు. మోడల్ స్కూల్ టీచర్లు 13 ఏండ్లుగా సమస్యలతో సతమతమవుతున్నారని, గ్రాంట్-ఇన్-ఎయిడ్, సొసైటీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రమోషన్ కూడా లేకపోవడం మోడల్ స్కూల్ టీచర్ల దుస్థితికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
