ప్రాజెక్టు కె అఫీషియల్ టైటిల్.. అమెరికాలో భారీ ఈవెంట్

ప్రాజెక్టు కె అఫీషియల్ టైటిల్.. అమెరికాలో భారీ ఈవెంట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ స్కైఫై మూవీ ప్రాజెట్ కె(ProjectK). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitaab bachan) కూడా ఓక కీ రోల్ లో కనిపించనున్నాడు.

దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే సినిమా నుండి రిలీజైన మేకింగ్ వీడియోస్ కు, అనౌన్స్మెంట్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుండి భారీ రెప్సాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ ఆ అంచనాలను అందుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రేంజ్ లో ఈ సినిమా ఉండనుందని మేకర్స్ ఇప్పటికే హిట్ ఇచ్చారు. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకి ఇప్పటివరకు అఫీషియల్ గా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు మేకర్స్. ప్రస్తుతానికి ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ఒక భారీ ఈవెంట్ నిర్వహించనున్నారట మేకర్స్. ఈ ఈవెంట్ జులై 7న అమెరికాలో భర్తీ ఎత్తున చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు హాలీవుడ్ నుండి స్టార్ హీరోస్ అటెండ్ కానున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇది కదా పాన్ వరల్డ్ మూవీ రేంజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రబాస్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి టైటిల్ రివీల్ కోసం ఈ రేంజ్ ఈవెంట్ ప్లాన్ చేశారంటే.. సినిమా ప్రమోషన్ కోసం ఏ రేంజ్ ప్లాన్ చేస్తారో అనుకుంటున్నారు నెటిజన్స్