
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ కే(Project K) నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ జులై 20న రానుంది అనే వార్తలు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని మేకర్స్ అదికారికంగా ప్రకటించారు.
అమెరికాలో ఎంతో ఘనంగా జరిగే శాన్ డియాగో కామిక్-కాన్(san diego comic con) వేడుకలో "ప్రాజెక్ట్-కె" ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ చేయనున్నట్టు ఈ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు అదేరోజు.. ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. జూలై 19న అమెరికాలో ఈ కామిక్- కాన్ వేడుకలు ప్రారంభం కానుండగా.. జులై 20న ప్రభాస్, అమితాబ్(Amitab), కమల్(Kamal haasan), దీపిక(Deepika), నాగ్ అశ్విన్(Nag Ashwin) ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. అదే వేదికపై ప్రాజెక్ట్ కే కి సంబందించిన టైటిల్ రివీల్ చేయనున్నారు. ఏ తెలుగు సినిమాకు ఇప్పటివరకు ఇలాంటి గౌరవం దక్కలేదు. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ కే సినిమాకు ఇది జరుగుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు కనీ.. వినీ.. ఎరుగని రీతిలో ప్రాజెక్ట్ కే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సోషియో ఫాంటసీ అండ్ స్కైఫై కాన్సెప్ట్ తో, భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా .. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అవనుంది అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.