Sci-Fi తో ప్రపంచాన్ని కాపాడే 'PROJECT-K'

Sci-Fi తో ప్రపంచాన్ని కాపాడే 'PROJECT-K'


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ 'కే'(Project K). జూలై 19న అమెరికాలో ఈ కామిక్- కాన్ వేడుకలు ప్రారంభం కానున్న విషయం తెలిసేందే.  Project K అంటే ఏమిటి..దీని వెనుక దాగి ఉన్న మీనింగ్ ఏంటో ప్రపంచం  తెలుసుకోవాలంటూ మేకర్స్ చేసిన ట్వీట్ తో.. ఫ్యాన్స్ అంతా  వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్  Project K అంటే  ఏంటో  కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్..

" పోస్టర్ లో సముద్రం..అందులో మునిగిన ఓడలు, ఒక పెద్ద చెయ్యి, చేతి ముందు డిఫెరెంట్ వెపన్స్ తో ముగ్గురు వ్యక్తులు.. చుట్టూ శిథిలాలు కనిపిస్తోన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేసిన మేకర్స్.. ' ప్రపంచాన్ని కాపాడే ఈ చేతికి అసమానమైన శక్తులతో కూడిన బలం ఉంటుందని తెలుస్తోంది. కాపాడే ఈ చెయ్యి ప్రభాస్ దే అని అర్ధం అవుతుంది. ఆధునిక యుగాన్ని కాపాడటానికి వచ్చిన విష్ణుమూర్తిలా హస్తం ఇస్తున్నాడని" మేకర్స్ హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఎన్నో విధ్వంసాలు ఎదుర్కొంటున్న ఈ యుగాన్ని కొత్త టెక్నాలజీ తో ఎదుర్కోవడానికి ప్రభాస్ ఓ శక్తి రూపంలో వస్తున్నట్టు కనిపిస్తోన్న ఈ పోస్టర్.. ప్రాజెక్ట్ కే మూవీ పై మరింత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.  మరో అప్డేట్ కూడా త్వరలో ఉంటుందంటూ మేకర్స్ ప్రకటిస్తూ క్యూరియాసిటీని పెంచేశారు. 

ఈ మూవీ అత్యాధునిక టెక్నాలజీతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ కే సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ప్రాజెక్ట్K 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.