వానా కాలం సీజన్​లో 36 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల నీళ్లు

వానా కాలం సీజన్​లో 36 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల నీళ్లు

హైదరాబాద్, వెలుగు:   ప్రాజెక్టుల కింద వానా కాలం సీజన్​లో 36.81 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ సీజన్​లో 91 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఈఎన్సీ(జనరల్) మురళీధర్​అధ్యక్షతన నిర్వహించిన స్టేట్​లెవల్​ కమిటీ ఫర్​ ఇంటిగ్రేటెడ్ ​వాటర్ ​ప్లానింగ్​ అండ్​ మేనేజ్​మెంట్(స్కివమ్) మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయించారు. 

ఈ సీజన్​లో మొత్తం 36.81 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 23.64 లక్షల ఎకరాల్లో వరి, 13.16 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీరు ఇవ్వనున్నారు. ఎస్సారెస్పీ స్టేజీ –1 కింద 9.04 లక్షల ఎకరాలు, మిడ్​మానేరు కింద 50 వేలు, కడెం కింద 53 వేలు, అలీ సాగర్​ కింద 49 వేలు, గుత్ప ఎత్తిపోతల కింద 36 వేలు, నిజాంసాగర్​ కింద 1.24 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించారు. 

జూరాల కింద లక్ష, ఆర్డీఎస్​కిద 55 వేలు, మూసీ కింద 30 వేలు, భీమా ఎత్తిపోతల కింద 1.47 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, కల్వకుర్తి ఎత్తిపోతల కింద 2.93 లక్షలు, ఎస్సారెస్పీ స్టేజ్​–2 కింద 3.58 లక్షలు, కాళేశ్వరం కింద 91 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు.