నితిన్ , అంజలి  మాస్ సాంగ్‌ ప్రోమో రిలీజ్

నితిన్ , అంజలి  మాస్ సాంగ్‌ ప్రోమో రిలీజ్

నితిన్ హీరోగా నటిస్తున్న "మాచర్ల నియోజకవర్గం" ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. నితిన్ సరసన  కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. ఓ స్పెషల్ సాంగ్లో అంజలి అలరించనుంది. ఈ మాస్ సాంగ్ జూలై 8న రిలీజ్ కానుంది ఈ పాటకు సంబంధించిన ప్రోమోను శుక్రవారం వదిలారు. ‘రా రా రెడ్డి’ అంటూ సాగే ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. నితిన్, అంజ‌లి మాస్ బీట్‌ స్టెప్స్ అదిరిపోయంటునక్నారు ఫ్యాన్స్. ఈ మాస్ సాంగ్‌, జాత‌ర‌లో జ‌రిగే ఫైట్ ముందు వ‌చ్చే పాట‌లా క‌నిపిస్తుంది. ఫుల్ సాంగ్ శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల కానుందని సినిమా యూనిట్ తెలిపింది. నితిన్ ఈ మూవీలో గుంటూరు జిల్లా క‌లెక్టర్గా న‌టించ‌నున్నాడు.  ఆదిత్య మూవీస్ ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్లపై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. "మాచర్ల నియోజకవర్గం"  నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.