'గతంలో రివర్షన్ పొందినోళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి'

'గతంలో రివర్షన్ పొందినోళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి'

పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వ కాలంలో అన్యాయంగా రివర్షన్ పొందిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి న్యాయం చేయాలని స్టేట్​ పవర్​ ఇంజనీర్స్​ అసోసియేషన్​ డిమాండ్​ చేసింది. ఆదివారం జెన్​కో ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్​ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్  జనరల్​ బాడీ సమావేశం జరిగింది. టీజీపీఈఏ ప్రెసిడెంట్ రత్నాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 800 మంది ఇంజనీర్లు హాజరై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

విద్యుత్ సంస్థలలో ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు, ఏఈల నియామకం త్వరలో చేపట్టాలని డిమాండ్​ చేశారు. రామగుండం పాత విద్యుత్​ ప్లాంట్ల స్థానంలో చేపట్టే కొత్త థర్మల్​ ప్లాంట్​ను కూడా జెన్​కో ఆధ్వర్యంలోనే చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 ఆగస్టు 31 వరకు ఉన్న  పెన్షన్​ సౌకర్యం 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు ఉన్న విద్యుత్​ ఉద్యోగులకు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఏ.వెంకటనారాయణ  రెడ్డి, పి సదానందం, కే అంజయ్య, శివశంకర్, మంగీలాల్, శ్రీనాథ్ రెడ్డి, జన  ప్రియ, సామ్య నాయక్, ఎన్ సురేశ్​ కుమార్, కె వెంకటేశ్వర్, విద్యుత్​ సంస్థలకు చెందిన ఆఫీస్​ బేరర్లు, బ్రాంచ్​ ఆఫీస్​ బేరర్లు సమావేశానికి హాజరయ్యారు.