బెల్ట్​ షాపులు ఎత్తేయాలంటూ ఆందోళన

బెల్ట్​ షాపులు ఎత్తేయాలంటూ ఆందోళన

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులు ఎత్తేసేలా చూడాలని రైతులు, గీతకార్మికులు ఎల్కతుర్తిలోని వైన్స్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద నాలుగు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్నారని, మందుబాబులు పొలాల్లో తాగుతూ చేన్లలో బాటిళ్లు పగలగొడుతున్నారని అన్నారు. కూలీలతో అసభ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

తాటివనంలో మద్యం విక్రయాలతో గీతకార్మికుల ఉపాధి దెబ్బతింటోందని, ఆయా బెల్ట్ షాపులకు మద్యం విక్రయించవద్దని కోరారు. వైన్స్​యజమాని దురుసుగా సమాధానం ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.