మహిళా సంఘాల్లో నిధుల గోల్‌‌‌‌మాల్‌‌‌‌పై ఆందోళన 

మహిళా సంఘాల్లో నిధుల గోల్‌‌‌‌మాల్‌‌‌‌పై ఆందోళన 

చేర్యాల, వెలుగు: మహిళా సంఘాలను తప్పుదోవ పట్టించి వారి ఖాతాల నుంచి సుమారు రూ.కోటి  మేర నిధులు గోల్ మాల్ చేశారంటూ మహిళా సంఘాలు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలకేంద్రంలోని ఎస్‌‌‌‌బీఐ ముందు ధర్నా నిర్వహించారు.

బాధిత మహిళా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దానంపల్లి గ్రామంలో 23 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటికి సీఏగా లింగాల మమత పనిచేస్తోంది. వివిధ మహిళా సంఘాల నుంచి వసూలైన సుమారు రూ.కోటిని సంఘాల ఖాతాల్లో జమచేయకుండా వాటిని ఇతర బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపించారు. నిధుల గోల్‌‌‌‌మాల్ వెనుక సీఏతోపాటు గుర్జకుంటకు చెందిన మరో సీఏ ఉన్నట్లు మహిళలు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తనపై మహిళా సంఘాలు చేస్తున్న ఆరోపణలపై మనస్తాపం చెందిన సీఏ మమత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.