'బ్రహ్మాస్త్ర' జంటను ఆలయంలోకి రాకుండా నిరసన

'బ్రహ్మాస్త్ర' జంటను ఆలయంలోకి రాకుండా నిరసన

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ సింగ్, ఆలియా భట్ లకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం దర్శనకు వెళ్లిన ఈ జంటను అక్కడి భజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. ఆలయంలోకి అనుమతించేది లేదని నిరసన చేపట్టారు. దీనంతటికీ ప్రధాన కారణం ఆలియా గత 11ఏళ్ల క్రితం చేసిన కామెంట్సే. తనకు బీఫ్ (ఆవు మాంసం)అంటే చాలా ఇష్టమని చెప్పిన ఓ క్లిప్ రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలియాపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన బ్రహ్మాస్త్ర మూవీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ... బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర పేరుతో ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల ఆమె బ్రహ్మాస్త్ర మూవీని చూడాలనుకుంటే చూడండి, ఆసక్తి లేకపోతే చూడకండి అంటూ చేసిన కామెంట్స్ కూడా ఆమెను వివాదంలో ఇరుక్కునేలా చేశాయి. ఇక ఇప్పుడేమో బ్రహ్రాస్త్ర రిలీజ్ సందర్భంగా మహా కాళేశ్వర్ దర్శనకు వచ్చిన మూవీ టీంను భజరంగ్ దళ్ సభ్యులు నల్ల జెండాలు పట్టుకొని వచ్చి వారిని అడ్డుకున్నారు. దీంతో స్థానిక పోలీసులు వారిని చెదరగొట్టారు. భద్రత కట్టుదిట్టం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చివరికి దర్శకుడు అయాన్ ముఖర్జీకి మాత్రం పర్మిషన్ ఇవ్వడంతో ఆయనొక్కడే దర్శనం చేసుకొని వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ నేత ప్రియాంక చతుర్వేది ఓ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటులతో కలిసి ప్రధాని మోడీ దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. సినీ ఇండస్ట్రీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని.. దీనిపై ఆధారపడి చాలా కుటుంబాలున్నాయని పేర్కొన్నారు. రాజకీయ దురభిమానం ఇంత దారుణానికి దారితీయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ఇక భజరంగ్ దళ్ సమన్వయ కర్త అంకిత్ జిందాల్ దీనిపై మాట్లాడుతూ... ఆలియా, రణ్ బీర్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోకి వెళ్లనివ్వమన్నారు. బీప్ ను తినడమనేది చాలా మంచి పని అన్న రణ్ బీర్ మాటలను సైతం ఆయన గుర్తు చేస్తూ.. అలా ఆలోచించే వారిని ఒక్కరిని కూడా భజరంగ్ దళ్ వదిలిపెట్టదని చెప్పారు. దీనిపై దేశమంతటా నిరసనలు జరుగుతున్నాయన్న అంకిత్ జిందాల్.. తాము ప్రశాంతంగానే నిరసనలు చేపట్టినా తమ కార్యకర్తలను పోలీసులు కొట్టారని.. దీన్ని సహించబోమని తెలిపారు. ఇదిలా ఉండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆలియా, రణ్ బీర్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.