బీహార్ లో బీపీఎస్సీ అభ్యర్థుల నిరసన

బీహార్ లో బీపీఎస్సీ అభ్యర్థుల నిరసన

బీహార్ లోని పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల నిరసన కొనసాగుతోంది. 67వ బీపీఎస్సీ పీటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ నిరసనకు దిగారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బీహార్ లోని మహిళలకు 35శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 2019 నుంచి కొనసాగుతున్న ఎగ్జామినేషన్ కంట్రోలర్ అమరేంద్ర కుమార్ ను సస్పెండ్ చేయాలన్నారు. ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఐదు రోజుల క్రితం బీపీఎస్సీ అధికారులు ఘటనపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు బీహార్ పబ్లిక్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. పారదర్శకత పాటించలేదంటూ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అవినీతి పరులను ఎగ్జామినేషన్ కంట్రోలర్ పోస్టుకు ఎందుకు ఎంపిక చేశారన్నారు. ఎగ్జామ్ లో వచ్చిన 9 ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు రిలీజ్ చేయాలన్నారు. అలాగే కట్ ఆఫ్ తగ్గించాలన్నారు.