Karnataka : అధికారంలోకొస్తే మహిళలకు రూ. 2వేలు

Karnataka : అధికారంలోకొస్తే మహిళలకు రూ. 2వేలు

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకుట్టుకునేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. హామీలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నెల నెలా 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. తాజాగా మరో హామీ ప్రకటించింది. గృహ లక్ష్మీ యోజన కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేలు ఇస్తామని మాట ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ ప్రకటించారు. 

కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్లో అమలు చేస్తోంది. కాంగ్రెస్  రాష్ట్రంలో  అధికారంలోకి  వస్తే  కర్నాటకలో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంపై అధికార బీజేపీ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ హామీ కేవలం మాటలకే పరిమితమవుతుందని చెప్పింది.