టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి : పీఆర్టీయూటీ

టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి : పీఆర్టీయూటీ
  •     సర్కారుకు పీఆర్టీయూటీ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు : గత ప్రభుత్వం ఆశాస్ర్తీయంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 ద్వారా నష్టపోయిన టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. చెన్నయ్య, సుంకరి భిక్షం గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. టీచర్లంతా తమ సమస్యలను కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందనే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చారని తెలిపారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు.

మిగిలి పోయిన కొంత మంది స్పౌజ్ టీచర్ల బదిలీలను వేసవిలో నిర్వహించాలని కోరారు. ఏండ్ల నుంచి బడికి పోకుండా ఎస్ సీఈఆర్టీలో తిష్టవేసిన టీచర్లను, వెంటనే బడులకు పంపించాలన్నారు. సమగ్ర శిక్ష ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బడుల్లో స్కావెంజర్లను నియమించాలని కోరారు.