ఆసిఫాబాద్ జిల్లాలో నాటుసారా నిషేదించాలని ర్యాలీ

ఆసిఫాబాద్ జిల్లాలో  నాటుసారా నిషేదించాలని ర్యాలీ

దహెగాం, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లా దహెగాం మండల కేంద్రంలో నాటుసారా నిషేధించాలని నిర్ణయించారు. గుడుంబా నిషేధిస్తామని శనివారం గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేశారు. గుడుంబాను నిర్మూలిద్దామంటూ నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. నాటుసారాను అరికట్టాలని తహసీల్దార్​మునావర్​షరీఫ్​కు, ఏఎస్సై రమేశ్​కు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువకులు, వృద్ధులు అని తేడా లేకుండా గుడుంబాకు బానిసై చెడు మార్గంలో నడుస్తున్నారని, తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా గుడుంబా తాగినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.