- విద్యాశాఖ మంత్రి సబితకు పీఆర్టీయూ వినతి
హైదరాబాద్,వెలుగు: సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్టు టీచింగ్, నాన్ టీచింగ్ కు 12 నెలల వేతనం ఇవ్వాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చినందుకు గానూ మంత్రికి విషెస్ తెలిపారు.
