PSLV-C46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

PSLV-C46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. నెల్లూరు జిల్లాలోని ఇస్రో శ్రీహరికోటలో PSLV-C46 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించింది. తెల్లవారు జామున 4.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. రేపు ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ46ను ప్రయోగించనున్నారు. 25 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియ  తర్వాత PSLV-C46 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని రాకెట్‌ మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. PSLV-C46 ప్రయోగం సందర్భంగా ఇవాళ ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ఈరోజు శ్రీహరికోటకు రానున్నారు.