ట్రెండింగ్లో బాలయ్య, పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్

ట్రెండింగ్లో బాలయ్య, పవన్ ఎపిసోడ్  ఫస్ట్ గ్లింప్స్

బాలయ్య , పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో త్వరలో ఆహాలో ప్రసారం కానుంది. అయితే  ఎపిసోడ్ కు  సంబంధించి ఆదివారం రిలీజ్ చేసిన  ఫస్ట్ గ్లింప్స్  యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఒక్కరోజులోనే 2.8 కోట్లకు పైగా వ్యూస్ సంపాదించి ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఆహా టీం తన ట్విట్టర్లో  వెల్లడించింది.  ‘నిమ్మలంగా కనపడే నిప్పుకొండ పవన్‌కల్యాణ్, రాజసానికి నిలువెత్తు నిదర్శనం NBK ఒకే వేదిక మీద మొదటిసారి కలిస్తే. ..మాటల తూటాలు పేలాల్సిందే. అత్యంత క్రేజీ ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి. అసలు సిసలైన ట్రెండ్ సెట్టర్ దిగాక ట్రెండింగ్ వన్ లో నిలిచింది’ అంటూ ట్వీట్ చేసింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా  పవన్ అభిమానుల కోసం ఆహా అన్ స్టాపబుల్ షోకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోలో  లగ్జరీ కార్లలో పవన్ ,బాలయ్య ఎంట్రీ సీన్ అదిరింది. స్టేజ్ పై పవన్ ను పరిచయం చేస్తూ ముందు నేను ఈయన మెజర్ మెంట్స్ తీసుకోవాలని బాలయ్య అంటాడు. దీనికి పవన్ పెద్దగా నవ్వుతాడు. ప్రోమోలో బాలయ్య సింగిల్ డైలాగ్ తో సరిపెట్టారు. జస్ట్ ప్రోమో అయినప్పటికీ ఈ ఎపిసోడ్ కు భారీ హైప్ వచ్చింది.