ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు

ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు

ఫ్యామిలీ, డబ్బు, ఉద్యోగం, ప్రేమ లాంటి రకరకాల కారణాలతో ప్రతీ ఐదుగురిలో ఒకరు ఒత్తిడికి గురవుతున్నారు ఈ మధ్య. దానివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒత్తిడి అనేది ప్రతీ ఒక్కరిలో ఉండే ప్రాబ్లమే. చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం మానేస్తే ఒత్తిడికి లోనవకుండా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలకు దూరం కావొచ్చు. దాని కోసం ఏం చేయాలో చెప్తోంది సైకియాట్రిస్ట్‌‌ డాక్టర్‌‌‌‌ సోనల్‌‌ ఆనంద్‌‌.

  •     ఆలోచన, ప్రవర్తన, ఇతరులతో మాట్లాడే విధానం కూడా ఒత్తిడికి కారణాలే. ఎందుకంటే, ఇతరులతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఏం మాట్లాడాలి? వాళ్లు మనతో ఎలా ఉండాలి అనే విషయాల్లో ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌ పెట్టుకుంటారు కొందరు. వాటిని చేరుకోనప్పుడు అది ఒత్తిడికి కారణం అవుతుంది. అందుకే ఎప్పుడూ ఒక విషయం ‘ఇలానే జరగాల’ని ఎక్స్‌‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. 
  •     జీవితం విషయంలో అవగాహన ఉండాలి. అంటే ‘లైఫ్‌‌ ఎటు పోతోంది. మన చేతుల్లోనే ఉందా?’ అనే విషయాల్ని పట్టించుకోవాలి. అప్పుడే వాటివల్ల ఫ్యూచర్‌‌‌‌లో వచ్చే స్ట్రెస్‌‌కి దూరంగా ఉండొచ్చు. 
  •     మూడ్‌‌ సరిగా లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలావరకు చెడు చేస్తాయి. అవతలివాళ్లకు నెగెటివిటీని పెంచుతాయి. దాంతో అది గొడవలకు దారి తీస్తుంది.  అప్పుడు ‘ఎదుటివాళ్లు నా గురించి ఏమనుకుంటున్నా’రో అని ఆలోచిస్తుంటారు. అలా నెగెటివ్‌‌ ఆలోచనలు ఇంకా పెరుగుతాయి. అందుకే గొడవ జరిగినప్పుడు తప్పు ఎవరిదంటూ ఎక్కువ ఆలోచించకుండా, సొల్యూషన్ వెతుక్కోవాలి.
  •  శారీరక, మానసిక ఆరోగ్యాలు కూడా ఒత్తిడికి కారణాలే. లావు లేదా సన్నగా ఉండటం చూసి మన గురించి వేరేవాళ్లు ఏం అనుకుంటారో అని ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతారు కొందరు. జబ్బు చేస్తే దానికి ట్రీట్మెంట్‌‌ తీసుకోవడం మానేసి ‘నాకు ఏదైనా జరుగుతుందేమో’ అని భయపడేవాళ్లు ఇంకొందరు. ఈ ఆలోచనలు ఒత్తిడి పెంచి ఆరోగ్యం ఇంకా ఎక్కువ పాడయ్యేలా చేస్తాయి.
  •     ఓటీటీ ట్రెండ్‌‌ వచ్చాక వాటికే అతుక్కుపోతున్నారు చాలామంది. ఓవర్‌‌‌‌ స్క్రీన్ టైం వల్ల కొత్తగా మెంటల్‌‌ హెల్త్ ప్రాబ్లమ్స్‌‌ వచ్చే అవకాశం ఉంది. అందుకే, ఎంత ఇష్టం ఉన్నా బ్రేక్స్‌‌ ఇస్తూ సినిమాలు, సిరీస్​లు చూడటం మంచిది. స్క్రీన్‌‌కి బ్రేక్స్ ఇస్తూ ఔట్‌‌డోర్‌‌‌‌ యాక్టివిటీలను చేయాలి.
  •     ఒత్తిడి ఎక్కువైతే గుండె సమస్యలు, ఆస్తమా, హైపర్‌‌‌‌ టెన్షన్‌‌, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి చిన్న విషయానికి  ఒత్తిడి పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యోగా, మెడిటేషన్‌‌ చేస్తూ కొంత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.