పీటీవో ఎస్ఐ అభ్యర్థులకు రాత పరీక్ష

పీటీవో ఎస్ఐ అభ్యర్థులకు రాత పరీక్ష

హైదరాబాద్, వెలుగు : పోలీస్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఆర్గనైజేషన్‌‌ (పీటీవో) ఎస్ఐ అభ్యర్థులకు రాత పరీక్ష (టెక్నికల్‌‌ పేపర్‌‌) ఈనెల 26న ఉంటుందని టీఎస్​ఎల్​పీఆర్​బీ ఆదివారం ప్రకటించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఎగ్జామ్ ఉంటుందని వివరించింది.

పరీక్షకు హాజరుకానున్న అర్హులైన అభ్యర్థులంతా www.tslprb.in  వెబ్‌‌సైట్‌‌ నుంచి ఈనెల 21 ఉదయం 8 గంటల నుంచి 24న అర్ధరాత్రి 12 గంటల దాకా హాల్‌‌టికెట్లు డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చని బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. పీటీవో ఎస్ఐ అభ్యర్థులకు రాత పరీక్షలో భాగంగా టెక్నికల్ పేపర్‌‌ కాకుండా నిర్వహించనున్న మిగిలిన రెండు పేపర్లకు సంబంధించి హాల్‌‌టికెట్ల జారీ తేదీలను త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు.