చెన్నూరులో దొంగల బీభత్సం... తిరుమల దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు...

చెన్నూరులో దొంగల బీభత్సం... తిరుమల దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు...

చెన్నూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని అస్నాద్ రోడ్డుకు చెందిన ఓ కుటుంబం తిరుమల దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసరికి  షాక్ ఇచ్చారు దొంగలు. సుమారు రెండు కిలోల వెండి వస్తువులు, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. శ్రీవారి దర్శనం చేసుకొని ఆనందంగా తిరిగి వచ్చిన ఆ కుటుంబానికి మరిచిపోలేని షాక్ ఇచ్చారు కేటుగాళ్లు. 

దొంగతనానికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్లూస్ టీం సహాయంతో నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు.