
న్యూఢిల్లీ: గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్‌లను తొలగించాయి. పబ్‌జీతో పాటు చైనాకు చెందిన 118 మొబైల్ యాప్స్‌ను ప్రభుత్వం బ్యాన్ చేయడంతో యాప్ స్టోర్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ యాప్‌లు డౌన్‌లోడ్‌లో అందుబాటులో లేవు. మొత్తంగా ఇండియా బ్యాన్ చేసిన మొబైల్ యాప్స్‌లో చైనాకు చెందినవి 224 ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం ఉందనే కారణంతో చైనాకు చెందిన యాప్స్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. తొలుత టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లను నిషేధించిన కేంద్రం, ఆ తర్వాత 47 యాప్‌లపై వేటు వేసింది. ప్రస్తుతం 118 యాప్‌లను బ్యాన్ చేసింది. కేవలం పబ్‌జీ మొబైల్ యాప్‌కే లక్షల కొద్దీ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. లాక్‌డౌన్ కారణంతో పబ్‌జీ గేమ్‌ను చాలా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.