పిల్లిని చూసి.. పులి అనుకుని భయపడ్డ జనం

పిల్లిని చూసి.. పులి అనుకుని భయపడ్డ జనం

మేడ్చల్ జిల్లాలో అడవి పిల్లిని చూసి పులి అనుకుని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని కైసరనగర్ డబుల్ బెడ్ రూమ్ సమీపంలో అడవి పిల్లి సంచరించింది. దానిని చూసి పులి అనుకుని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు...అడవి పిల్లి అని తెలిపడంతో స్థానికులు రిలాక్స్ అయ్యారు. వింతగా కనిపించిన పిల్లిని చూసేందుకు స్థానికులు ఎగబడటంతో అడవి పిల్లిని  బోనులో బంధించి తీసుకెళ్లారు అధికారులు.