రాష్ట్రంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ కేసులు నమోదు కాలే

రాష్ట్రంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ కేసులు నమోదు కాలే

రాష్ట్రంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ కేసులు నమోదు కాలేదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. యూకే, యూఎస్ లో డెల్టా వేరియంట్ కేసులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని.. ఒకటి రెండు రోజుల్లో కోటి మార్క్ ని దాటుతుందన్నారు. నిన్నటి నుంచి 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పారు. స్కూల్స్, కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్ల ఐడీ కార్డులు చూపి వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెప్పారు.  కేంద్రం నుంచి తెలంగాణకు జులైలో 21 లక్షల టీకా డోస్ లు అలాట్ అయ్యాయన్నారు.