బీఆర్ఎస్ ను బొందపెట్టేది బీజేపీయే: కార్యవర్గ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ ను బొందపెట్టేది బీజేపీయే: కార్యవర్గ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

జహీరాబాద్, వెలుగు :  ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పిన కేసీఆర్​తెలంగాణను అప్పుల పాలు చేశారని, బీజేపీ ఒక్కటే బీఆర్ఎస్ ను బొంద పెడుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం జహీరాబాద్ లోని షెట్కార్ ఫంక్షన్ హాల్ లో మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సిద్ధాంతాలు లేవని, సిద్ధాంతాలు ఉన్న పార్టీ కేవలం బీజేపీయేని తెలిపారు. బూత్ లెవెల్ నుంచి బీజేపీని పటిష్టపర్చాలని పిలుపునిచ్చారు. 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ్ చందర్ రాజనర్సింహ, నాయకులు జగన్నాథ్, జనార్దన్ రెడ్డి, సుధీర్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, మల్లికార్జున్ పటేల్, సుధీర్ భాండారి, నరేశ్​ పటేల్ తదితరులు 
పాల్గొన్నారు.