ప్రజా గాయకులం ఏకమై పాలకులను నిర్ణయిస్తం

ప్రజా గాయకులం ఏకమై పాలకులను నిర్ణయిస్తం

సీఎం కేసీఆర్ పై  ప్రజా గాయకుడు గద్దర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.  అధికారంలోకి వచ్చేదాకా తనది ఉద్యమపథం అని చెప్పుకున్న కేసీఆర్.. అధికార పీఠం ఎక్కిన మరుక్షణమే ‘ఫక్తు రాజకీయం’ చేస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. దీన్నిబట్టి కేసీఆర్ ఇక ఉద్యమకారుడు కాదని తేలిపోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో కేవలం టోపీలు మారాయే తప్ప.. రాజకీయ రూపు ఏ మాత్రం మారలేదని అభిప్రాయపడ్డారు. ‘‘ ఇది పాటల యుగం.. ప్రతి పల్లెకు తిరుగుతాం. ఈ రెండు సంవత్సరాలు ఇదే పని.  ప్రజా గాయకులం అందరం ఏకమై ఈ రాష్ట్రానికి పాలకులను నిర్ణయిస్తం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.  కాగా, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన గాయకురాలు ఉట్ల స్వర్ణ తల్లి శాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో  కన్నుమూశారు. వారి కుటుంబ సభ్యులను శనివారం  పరామర్శించిన  ప్రజా గాయకుడు గద్దర్ పై వ్యాఖ్యలు చేశారు.