గవర్నర్ ను తొలగించాలని ఆందోళనకు దిగిన సీఎం

గవర్నర్ ను తొలగించాలని ఆందోళనకు దిగిన సీఎం

లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి.  పుదుచ్చేరిలోని  అన్నా సలై దగ్గర వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ఆందోళనలో పాల్గొంటున్నారు. నారాయణ స్వామి నిరసన మూడో రోజుకు చేరింది. పగలు, రాత్రి కూడా అన్నా సలైలోనే గడుపుతున్నారు ముఖ్యమంత్రి. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నిరసనలో పాల్గొంటున్నారు. గోబ్యాక్ కిరణ్ బేడీ అంటూ నినాదాలు చేస్తున్నారు కార్యకర్తలు.

లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ  వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అభివృద్ధి ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని పాలక కూటమి ఆరోపించింది.  ఈ నిరసనలో రెవెన్యూ మంత్రి ఎంఓహెచ్‌ఎఫ్ షాజహాన్, ఎంపి వైతిలింగం, కూటమి భాగస్వాములైన సిపిఐ, సిపిఐ (ఎం) పాల్గొన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వంలో కాంగ్రెస్ కూటమి భాగస్వామి అయిన డిఎంకె ఆందోళనలో పాల్గొనలేదు. ఈ నిరసనను రాజ్ నివాస్ (లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం) సమీపంలో ప్లాన్ చేశారు. కాని   అక్కడ  పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్లేస్  మార్చారు.