భారీ వరదకు కొట్టుకుపోయిన పులిచింతల గేట్

భారీ వరదకు కొట్టుకుపోయిన పులిచింతల గేట్

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీ వరద వస్తోంది. దాంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దాంతో ప్రాజెక్ట్ గేట్లు 2 అడుగుల మేర ఎత్తాలని అధికారులు భావించారు. ఆ క్రమంలో గేట్లు ఎత్తుతుండగా.. 16వ నెంబర్ గేట్ విరిగిపోయింది. దాంతో దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గేటు విరగడంతో.. దాని స్థానంలో ఎమర్జేన్సీ గేటు ఏర్పాటు చేసే ప్రయత్నంలో అధికారులు తలమునకలవుతున్నారు. భారీగా ప్రవాహం ఉండటంతో ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిషేధించారు. అంతేకాకుండా.. ప్రాజెక్ట్ దిగువ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.