కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలిస్టిక్దవాఖానలో 'పల్స్ ఫీల్డ్ఆబ్లేషన్' అనే గుండె సంబంధిత నూతన టెక్నాలజీని మంగళవారం ప్రారంభించారు. దవాఖాన చైర్మన్‌వి.ఎస్.రామచంద్ర మాట్లాడుతూ గుండె కొట్టుకోవడంలో తేడాలున్న వారికి ఈ చికిత్సా విధానం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు.
గుండె లోపలి విద్యుత్ప్రవాహంలో హెచ్చుతగ్గుల కారణంగా బ్రెయిన్‌స్ట్రోక్,పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉందని, నూతన టెక్నాలజీ ద్వారా వాటిని నివారించి గుండెతో పాటు రక్త కణాలకు గంటల వ్యవధిలోనే చికిత్స అందించగలమన్నారు. రాష్ట్రంలో తమ దవాఖానలోనే ఫస్ట్‌టైం ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నామన్నారు. డాక్టర్లు గోవింద్, ప్రకాశ్, భరణి పాల్గొన్నారు.
