
హైదరాబాద్, వెలుగు: జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా మార్చి 10వ తేదీ నుంచి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గుగులోతు రవి తెలిపారు. పల్స్‌పోలియోలో 0 నుంచి5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలో ఈ వయస్సు పిల్లలు 4,85,965 మంది ఉన్నారు. వారికి ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. పోలియో కేం ద్రానికి వెళ్లలేని వారికి మార్చి11, 12,13 తేదీలలో ఇంటి వద్దకు వచ్చి పోలియో చుక్కలు వేస్తారన్నారు.