మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం

మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం

హైదరాబాద్: రాష్ట్రంలో మూడ్రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఆదివారం ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రేపు, ఎల్లుండి ఇంటింటికీ తిరిగి పోలియో డ్రాప్స్ వేసేలా ప్రణాళిక రెడీ చేశామన్నారు. కరోనాతో పల్స్ పోలియో కార్యక్రమం కొంత అలస్యమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కోసం 23వేల సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానాలతో పాటు.. మరో 96 దవాఖానాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.ప్రతి రోజు 24 గంటలు ఈ బస్తీ దవాఖానాలు పని చేస్తాయన్నారు. 

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. పోలియో రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.

మరిన్ని వార్తల కోసం:

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్.. ధోని న్యూలుక్ అదిరింది