నేడే పల్స్ పోలియో

నేడే పల్స్ పోలియో

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల మందు అందించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,31,907 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉండగా..మొత్తం 23,331 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50.14 లక్షల పల్స్‌ పోలియో డోసులు పంపించారు.

సంచార జాతులు, బిక్షాటన చేసేవారు, ఇటుకబట్టీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికివాడలు, ఆదివాసీ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్‌ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. మొత్తం 2,337 మంది సూపర్‌వైజర్లు, 869 సంచార బృందాలు, 8,589 మంది ఏఎన్‌ఎమ్‌లు, 27,040 మంది ఆశాకార్యకర్తలు, 35,353 మంది అంగన్వాడీలు పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

నల్లమలలో యురేనియం సర్వే