
పుల్వామా ఘటనపై ఇటు కేంద్రం, అటు దేశ ప్రజలు సీరియస్ గా ఉన్నారు. పాక్ ను ఇరుకున పెట్టే ఏ అంశాన్ని భారత ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు.ఇటు దేశ ప్రజలు కూడా అమరుల కుటుంబాలకు తమకు తోచినంత సహాయం చేస్తూ పాక్ పై నిరసన తెలుపుతున్నారు. పాక్ తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని సూచిస్తున్నారు. పాక్ పై ఉన్న ఆగ్రహం..బెంగళూరులోని కరాచీ బేకరీపై పడింది. కరాచీ అనే పేరు పాకిస్తాన్ కు చెందిన నగరానిది అని.. షాప్ ముందు ఆందోళన చేశారు. దీంతో తాము పాకిస్తాన్ కు చెందిన వాళ్లముకాదని వివరణ ఇచ్చుకుంది కరాచీ యాజమాన్యం. అయినా ఆందోళనకారులు శాంతించక పోవడంతో.. కరాచీ అనే దుకానం బోర్డు పై బట్టకప్పి షాప్ మీద జాతీయ జెండా ఎగురవేశారు. దీంతో శాంతించిన ఆందోళన కారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. దేశవిభజన సమయంలో ఖాన్ చంద్ రమణి అనే వ్యక్తి భారత్ కు వచ్చి స్థిరపడ్డాడు. హైదరాబాద్ వేధికగా… కరాచీ బేకరీని స్టార్ట్ చశాడు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో కరాచీ బేకరీ ఉంది.