ఆన్‌లైన్ క్లాసు మ‌ధ్య‌లో ప్లే అయిన పోర్న్ క్లిప్‌

V6 Velugu Posted on Aug 03, 2021

పుణే: క‌రోనా కార‌ణంగా స్కూళ్లు, కాలేజీలు..  ఆన్‌లైన్ విధానంలోనే క్లాసులు నిర్వ‌హిస్తున్నాయి. ఈ క్లాసుల‌కు సంబంధించిన ఆన్‌లైన్ లింక్, పాస్‌వ‌ర్డ్‌ల‌ను స్కూల్ మేనేజ్‌మెంట్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా విద్యార్థుల ఫోన్ల‌కు పంపుతుంటుంది. అయితే ఈ వివ‌రాల‌ను తెలుసుకుని కొంత మంది క్లాసుల మ‌ధ్య‌లో చొర‌బ‌డి పోర్న్ క్లిప్‌లు ప్లే చేస్తున్న ఘ‌ట‌న‌లు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని పుణేలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో టీచ‌ర్లు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీనిపై ఫిర్యాదు చేయ‌డంతో ప్రాథ‌మిక ద‌ర్యాప్తు చేసిన ఖేడ్ పోలీస్ స్టేష‌న్ సిబ్బంది.. ఈ కేసును పుణే రూర‌ల్ సైబ‌ర్ సెల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తున్న‌ట్టు తెలిపారు.

పుణేలోని రాజ్‌గురు న‌గ‌ర్‌లో ఉన్న ఒక ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో శుక్ర‌వారం ఐదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాస్ జ‌రుగుతుండ‌గా స‌డ‌న్‌గా పోర్న్ క్లిప్ ప్లే అయింది. క్లాసు మొద‌లైన కొద్ది సెక‌న్ల‌కే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ పోర్న్ వీడియో ప్లే కాగానే, వెంట‌నే టీచ‌ర్, విద్యార్థుల త‌ల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఒక్కో స్టూడెంట్ వెంట‌వెంట‌నే లాగ్ ఔట్ అయ్యారు. దీనిపై పిల్ల‌ల త‌ల్లిదండ్రులు సీరియ‌స్ కావ‌డంతో స్కూల్ ప్రిన్సిపాల్.. ఖేడ్ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. రోజూ క్లాస్‌కు సంబంధించిన లింక్‌, లాగిన్ పాస్‌వ‌ర్డ్ వివ‌రాల‌ను పిల్ల‌ల ఫోన్‌కు పంపుతార‌ని, శుక్ర‌వారం నాడు ఎవ‌రో ఆ వివ‌రాల‌ను బ‌య‌టి వాళ్ల‌తో షేర్ చేయ‌డంతో వాళ్లు లాగిన్ అయ్యి ఈ ప‌ని చేసి ఉండొచ్చ‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్న‌ట్లు ఖేడ్ పోలీస్ స్టేష‌న్ సీఐ స‌తీశ్ గౌర‌వ్ తెలిపారు. క్లాస్ జ‌రుగుతున్న‌ప్పుడు 30 మంది లాగిన్ అయ్యి ఉన్నార‌ని, అన్ని లాగిన్ అడ్ర‌స్‌ల‌ను ప‌రిశీలించి ఎవ‌రు ఈ ప‌ని చేశారో తేల్చేందుకు సైబ‌ర్ సెల్‌కు కేసును అప్ప‌గిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. కాగా, గ‌తంలోనూ ఇలా ఆన్‌లైన్ క్లాస్ జ‌రుగుతుండ‌గా వేర్వేరు ప్రాంతాల్లో పోర్న్ క్లిప్‌లు ప్లే అయిన సంద‌ర్భాలు ఉన్నాయి.

Tagged POLICE, pune, online class, porn video

Latest Videos

Subscribe Now

More News