పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. పంజాబ్లో మొత్తం 117స్థానాలుండగా.. అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 59 సీట్లు ఆప్ గెల్చుకుంటుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమవుతుందని అంటున్నాయి.
ఇండియా టుడే యాక్సిన్ మై ఇండియా
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరిస్తుందని ఇండియా టుడే యాక్సిన్ మై ఇండియా అంచనా వేసింది. ఆప్ 76 నుంచి 90 సీట్లను కైవసం చేసుకుని తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెబుతోంది. కాంగ్రెస్కు 19 నుంచి 31 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని.. బీజేపీకి 1నుంచి 4 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేస్తోంది. అకాలీదళ్ కేవలం 7 నుంచి 11 సీట్లలో ప్రభావం చూపుతుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశముంది.
పీ మార్క్
పీ మార్క్ నిర్వహించిన సర్వే ప్రకారం పంజాబ్లో ఆమ్ ఆద్మీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఆప్కు 62 నుంచి 70 వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కేవలం 23 నుంచి 31 వరకు సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని, అకాలీదళ్ కు 16 నుంచి 24, బీజేపీకి 1 నుంచి 3 స్థానాల్లో ప్రభావం చూపుతాయని చెబుతోంది.
రిపబ్లిక్
రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 62 నుంచి 70 స్థానాలు, కాంగ్రెస్కు 23 నుంచి 31 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. అకాలీదళ్కు 15 సీట్లు, ఇతరులు 10 స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది.
న్యూస్ ఎక్స్
న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం పంజాబ్లో ఆమ్ ఆద్మీ 56 నుంచి 61 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 24 నుంచి 29 స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. అకాలీదళ్ 22 నుంచి 26, బీజేపీ 1 నుంచి 6 సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది.
ఇండియా టుడే
ఇండియా టుడే అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ 76 నుంచి 90 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్ 19 నుంచి 31 సీట్లు, అకాలీదళ్ 7 నుంచి 11, బీజేపీకి 1 నుంచి 14 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.
ఆత్మసాక్షి
ఆత్మ సాక్షి అంచనా ప్రకారం పంజాబ్ లో కాంగ్రెస్ అధికారం దక్కించుకోనుంది. ఆ పార్టీ 58 నుంచి 61 స్థానాల్లో సత్తా చాటుతుందని చెప్పింది. ఆప్ 34 నుంచి 38 సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపింది. అకాలీదళ్ కు 18 నుంచి 21 వరకు.. బీజేపీ 4 నుంచి 5 సీట్లు దక్కించుకునే ఛాన్సుందని ఎగ్జిట్ పోల్ లెక్కలు చెబుతున్నాయి.

