V6 News

ఆ ఏడుగురు ఎంపీలపై వేటు వేయండి.. ఉపరాష్ట్రపతిని కోరిన ఆప్ ఎంపీలు

ఆ ఏడుగురు ఎంపీలపై వేటు వేయండి.. ఉపరాష్ట్రపతిని కోరిన ఆప్ ఎంపీలు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఆప్​కు చెందిన మిగతా ముగ్గురు ఎంపీలు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ను కోరారు. శనివారం వారు రాధాకృష్ణన్‌‌‌‌ ను కలిసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చూసి వీరికి ఓటేస్తే వీరేమో పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. 

బీజేపీ తన ఆపరేషన్ లోటస్ ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థల(ఈడీ, సీబీఐ)ను ప్రయోగించి తమ నేతలను భయపెట్టి లోబరుచుకుందని ఆరోపించారు. ఎంపీలు కావాలనే పార్టీని వీడారు కాబట్టి, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చైర్మన్‌‌‌‌ను కోరామని, దీనిపై న్యాయపరంగానూ పోరాడుతామని పేర్కొన్నారు. మరోవైపు, ఏడుగురు సభ్యుల సంతకాలతో కూడిన విలీన పత్రాన్ని రాఘవ్ చద్దా ఇప్పటికే సమర్పించారు.