V6 News

బరువు తగ్గాలనుకునే వారికి సమ్మర్ డిటాక్స్ డ్రింక్స్..మీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

బరువు తగ్గాలనుకునే వారికి సమ్మర్  డిటాక్స్  డ్రింక్స్..మీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

వేసవిలో హైడ్రేషన్​ మెయింటెయిన్​ చేయడానికి, బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవాళ్లకి,  హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుచుకోవడానికి డిటాక్స్ డ్రింక్స్ ఎంతో మేలు చేస్తాయి. మరింకెందుకాలస్యం.. వెంటనే షురూ చేయండి. 


హైడ్రేషన్ డ్రింక్

.కావాల్సినవి: 
నీళ్లు - ఒక లీటర్ 
నిమ్మకాయ - ఒకటి 
కీర దోసకాయ - సగం 
పుదీనా ఆకులు - పది
సబ్జా గింజలు - ఒక టీస్పూన్
నల్ల ఉప్పు - చిటికెడు 
తయారీ: సబ్జా గింజలను విడిగా నానబెట్టాలి. ఒక గాజు సీసాలో నీటిని తీసుకుని అందులో నిమ్మకాయ, దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు వేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా అలాగే ఉంచాలి. మరుసటిరోజు అందులో సబ్జా గింజలు వేసుకుని రోజంతా కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. దాంతో శరీరంలో వేడి తగ్గి, బాడీలో హైడ్రేషన్ మెయింటెయిన్ అవుతుంది.

స్పైసీ టానిక్ 

కావాల్సినవి: 
నీళ్లు - ఒక గ్లాస్​
వాము, సోంపు, జీలకర్ర - 
ఒక్కో టీస్పూన్
తేనె - కొద్దిగా 
అల్లం - చిన్న ముక్క


తయారీ: 
ఒక గ్లాసు నీటిలో జీలకర్ర, సోంపు, వాము, అల్లం ముక్క వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టాలి. అందులో తేనె కలుపుకుని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ డ్రింక్​ మెటబాలిజంను ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్​లాస్​కు ఉపయోగకరంగా ఉంటుంది.


స్మూతీ

కావాల్సినవి: 
పుచ్చకాయ ముక్కలు,  కొబ్బరి నీళ్లు - ఒక్కో కప్పు
ఆపిల్ - ఒకటి
చియా సీడ్స్ - ఒక టీస్పూన్ 
దాల్చిన చెక్క - చిన్న ముక్క
కొత్తిమీర - కొద్దిగా 


తయారీ : 
మిక్సీజార్​లో కొబ్బరి నీళ్లు పోసి అందులో పుచ్చకాయ, ఆపిల్ ముక్కలు, దాల్చిన చెక్క, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ముందుగానే నానబెట్టిన చియా సీడ్స్​ను పైన వేసుకుంటే తాగడమే తరువాయి. ఈ డ్రింక్​ శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో సాయపడుతుంది.