హసన్ పర్తి, వెలుగు : విద్యార్థులకు ప్లేస్ మెంట్ చూపడంలో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలుస్తుందని యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎ.వరదారెడ్డి అన్నారు. శనివారం ఎస్సార్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్- 2026ను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛాన్స్లర్, వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ దీపక్ గార్గ్, డీన్ ఆపరేషన్స్, గ్రోత్ డాక్టర్ ఆర్.అర్చనారెడ్డి, ట్రైనింగ్, ప్లేస్మెంట్స్ అసోసియేట్ డైరెక్టర్ జి.సునీల్ రెడ్డి హాజరయ్యారు.
వరదారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, కృషి, సరైన మార్గదర్శకత్వం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం సునీల్ రెడ్డి ప్లేస్మెంట్ నివేదికను అందించారు. 1300కు పైగా విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. అదనంగా, 1500కు పైగా ఇంటర్న్ షిప్ అవకాశాలు సాధించారని పేర్కొన్నారు.

