స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 23న ప్రారంభమై మే 14న ముగుస్తుంది.
పోస్టు పేరు: జూనియర్ ట్రాన్స్‌లేటర్.
మొత్తం ఖాళీలు: 84.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ/ ఇంగ్లిష్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ట్రాన్స్లేషన్లో డిప్లొమా లేదా పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 23.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబసీ, ఈడబ్ల్యూఎస్ లకు రూ.100 . ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 14.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 2026 ఆగస్టు – సెప్టెంబర్.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.ssc.gov.inను సందర్శించండి.

