ఆన్లైన్లో ఆర్డర్ కేక్ తిని..బర్త్డే రోజే బాలిక మృతి

ఆన్లైన్లో ఆర్డర్ కేక్ తిని..బర్త్డే రోజే బాలిక మృతి

పాపం చిన్నారి..అప్పటి వరకు బర్త్ డే సంబరాల్లో మునిగి తేలింది. బంధువులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు తల్లిదండ్రులు. కొత్త బట్టలు ధరించి కేక్ కట్ చేసిన చిన్నారికి అందరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారికి ఇష్టమైన ఎన్నో గిఫ్ట్ లు తెచ్చారు బర్త్ డే వేడుకలకు వచ్చినవారంతా.. చిన్నారి ఆనందానికి అవధులు లేవు.. కానీ ఆ చిన్నారి సంతోషం ఎంతో సేపు ఉండలేదు. కేక్ కట్ చేసి మొదటి పీస్ తిన్న ఆ చిన్నారి ఉన్నట్టుంది కుప్పకూలిపోయింది.. ఏమైందో ఏమో తెలియక ఏడుస్తూ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జరగరానిది జరిపోయింది. 

పంజాబ్కు చెంది, మాన్వి.. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. మార్చి 24 సాయంత్రం 7 గంటలకు కేక్ కట్ చేసిన చిన్నారి.. తనతోపాటు తన కుటుంబ సభ్యులంతా ఆ కేక్ తిన్నారు. అందరూ బర్త్ డే వేడుకల్లో మునిగి తేలుతుండగా.. ఒక్కసారిగా కేక్ తిన్న వారంతా వాంతులు చేసుకున్నారు. మాన్వి విపరీతమై దాహంతో గొంతు ఎండిపోయి సృష తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందింది చిన్నా మాన్వి. 

బర్త్ డే కోసం ఆర్డర్ చేసిన కేక్ లోనే ఏదో విషముందని అందుకే తమ పాప చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెకరీ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చిన్నారి మృత దేహానికి పోస్టు మార్టమ్ పూర్తి చేశాం.. కేక్ శాంపిల్ ని పరీక్షల కోసం పంపామని , రిపోర్టు కోసం రాగానే దర్యాప్తు చేపడతామన్నారు పోలీసులు.