PBKS vs LSG: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు చేరిన వేళ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది. పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో సూపర్ జాయింట్స్ (LSG), ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు షాకిచ్చి హోమ్ గ్రౌండ్‌లో పరువు నిలుపుకోవాలని చూస్తోంది. గాయం కారణంగా లక్నో స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం.. జట్టులోకి మార్కో జాన్సెన్, వైశాఖ్ విజయ్ కుమార్ వచ్చారు. ఇదొక డూ-ఆర్-డై మ్యాచ్ కావడంతో చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.. మేమెప్పుడూ ఇలాంటి సిట్యుయేషన్‌లో లేము, మా బాయ్స్ అంతా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. ఈ పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగుంటుంది, హై-స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది.. మా జట్టులో అర్జున్ టెండూల్కర్, అర్షిన్ కుల్కర్ణి రూపంలో రెండు మార్పులు జరిగాయి.. ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది, కానీ వ్యక్తిగతంగా, టీమ్‌గా చాలా విషయాలు నేర్చుకున్నాం.. మా కోసం వచ్చిన ఫ్యాన్స్‌కు సారీ చెబుతున్నా.. ఈ రోజు మా 100 శాతం ఇస్తామని పంత్ పేర్కొన్నాడు.
►ALSO READ | ఫిఫా వరల్డ్ కప్‌లో ఎబోలా వైరల్ కలకలం.. డీఆర్ కాంగో జట్టు క్వారంటైన్‌కు అమెరికా ఆదేశం!
ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: జోష్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
🚨Toss update from Lucknow 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPL
— IndianPremierLeague (@IPL) May 23, 2026
Updates ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/FZTDevYeis
