బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్​

బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్​

బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్​కు మంచి క్రేజ్​ ఉంటుంది. అలాంటి పోస్టులకు పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, యూనియన్​ బ్యాంకులు 1631 ఆఫీసర్​ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేశాయి. పదోన్నతులతో పాటు అఫీషియల్​ లైఫ్​, ఆకర్షణీయమైన జీతం, భద్రమైన కెరీర్​కు బ్యాంక్​ జాబ్​ భరోసా ఇస్తాయి. ఈ నేపథ్యంలో పోస్టుల వివరాలకు, ఎగ్జామ్​ ప్యాటర్న్​,  సిలబస్, ప్రిపరేషన్​ విధానం తెలుసుకుందాం.. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్​ రంగంలో ఉద్యోగం సంపాదించాలనేది నిరుద్యోగుల కల. మంచి జీతం, తక్కువ సమయంలోనే ప్రమోషన్స్​, ఆకర్షణీయమైన అలవెన్స్​లు బ్యాంక్​ ఎంప్లాయీస్​​కు ఉంటాయి. డిగ్రీ విద్యార్హతతో భద్రమైన బ్యాంక్​ కొలువులో స్థిరపడేందుకు నిరుద్యోగులకు మంచి అవకాశం ఈ నోటిఫికేషన్​తో దొరికింది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష, గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్కషన్, పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కామన్​ సబ్జెక్టులు

రీజనింగ్​ ఎబిలిటీ :  గతేడాది పరీక్షలో సిట్టింగ్​ అరేంజ్​మెంట్​, పజిల్​ టెస్ట్​, స్టేట్​మెంట్స్​ అండ్​ కన్​క్లూజన్స్, కోడింగ్​–డీకోడింగ్​, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచే దాదాపు అన్ని ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఆయా టాపిక్​ల్లో ఉన్న అన్ని మోడల్స్​, మెథడ్స్​ సాధన చేయాలి. వీటితో  పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్‍ టెస్ట్, ర్యాంకింగ్‍ టెస్ట్ వంటి వర్బల్‍ రీజనింగ్‍ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. కోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్, కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్​ ఎఫెక్ట్, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫరెన్స్​, మిర్రర్‍ ఇమేజస్‍, వాటర్‍ ఇమేజస్‍, పేపర్‍ ఫోల్డింగ్‍, పేపర్‍ కట్టింగ్‍, ప్యాటర్న్ కంప్లీషన్‍

 ఎంబెడ్డెడ్‍ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్‍ రీజనింగ్‍ అంశాలు ప్రాక్టీస్‍ చేయాలి. రీజనింగ్‍కు ప్రత్యేకంగా పుస్తకాలు చదవాల్సిన పనిలేదు. దాదాపు నాలుగైదు సంవత్సరాలకు చెందిన అన్ని బ్యాంకు ప్రీవియస్‍ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా సాధన చేయడం వల్ల మెథడ్స్, మోడల్స్ పై అవగాహన పెరుగుతుంది. తద్వారా పరీక్షలో వేగంగా, లాజికల్‍గా ఆలోచించవచ్చు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్​ /న్యూమరికల్​ ఎబిలిటీ : ఈ విభాగంలో అరిథ్‍మెటిక్‍ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్‍ సిరీస్‍, నంబర్‍ సిస్టం,  సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్‍ క్యూబ్స్, డెసిమల్‍ ఫ్రాక్షన్స్, ప్లాబ్లమ్స్ ఆన్‍ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ వంటి వాటిని ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా సాధన చేయాలి. 

ఈ విభాగంలో  వేగంగా సాధించేలా ప్రాక్టీస్‍ చేస్తూ క్వికర్​ మ్యాథ్స్​ మెథడ్స్​, షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కట్స్​ నేర్చుకోవడం వల్ల ఎగ్జామ్​లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయవచ్చు. గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్​ సిరీస్​, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్​ప్రిటేషన్​, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్​ టాపిక్​ల నుంచే ప్రశ్నలిచ్చారు.

జనరల్​ అవేర్​నెస్ ​:  బ్యాంకింగ్​ రిలేటెడ్​ జనరల్​ అవేర్​నెస్​ టాపిక్​ల మీద దృష్టి పెట్టాలి. కరెంట్‍ అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్‍ నాలెడ్జ్ లో దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. భారతీయ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ, స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్, ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటి సమాచారం తెలుసుకోవాలి.
 

ఇంగ్లీష్​ లాంగ్వేజ్ ​: ఇంగ్లీష్​లో ప్యాసేజ్​ ఆధారిత ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి. పేరాగ్రాఫ్​ చదివి విషయాన్ని అర్థం చేసుకోగలిగితే సులువుగా 10 మార్కులు పొందవచ్చు. గతేడాది ఇదే పరీక్షలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీ ఎరేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, వన్ వర్డ్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంటోనిమ్స్​, సినానిమ్స్​ వంటి టాపిక్స్ నుంచి ఒక్కో అంశంలోనే నేరుగా ఐదు ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి నేర్చుకునే టాపిక్​ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇంగ్లీష్​ లో వొకాబులరీతోనే సగానిపైగా మార్కులు పొందవచ్చు. గ్రామర్‍ తో పాటు జనరల్‍ ఇంగ్లీష్‍ స్కిల్స్ పెంచుకోవాలి. వీటికి ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్లు చదవడం, సబ్‍టైటిల్స్ కలిగి ఉండే ఇంగ్లీష్‍  సినిమాలు చూడటం, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్తలు

సంబంధిత రంగ నిపుణుల ప్రసంగాలు వినడం వల్ల ఈ సబ్జెక్టుకు ప్రత్యేకంగా పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదు. ఇంగ్లీష్ దినపత్రికలు, చానళ్లలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిని పరిశీలించాలి. చదవడం కంటే వినడం వల్ల ఎక్కువ విషయాలు గుర్తుంటాయి కాబట్టి వేగంగా, బిగ్గరగా చదవడం వల్ల పరీక్షలో ప్రశ్నలను సులభంగా, తొందరగా అర్థం చేసుకోవచ్చు. 

డేటా అనాలసిస్​ అండ్​ ఇంటర్​ప్రిటేషన్ : ఇందులో బార్​ గ్రాఫ్​లు, లైన్​ చార్ట్​లు, ట్యాబులార్, కేస్​లెట్, రాడార్​/వెబ్​, పై చార్ట్​, క్వాడ్రాటిక్​ ఈక్వేషన్స్, నంబర్​ సిరీస్​, అప్రాక్సిమేషన్ అండ్​ సింప్లిఫికేషన్​, డేటా సఫీషియన్సీ టాపిక్​ల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి షార్ట్ కట్స్​ ఉండవు. ప్రశ్నలు నేరుగా ఇస్తారు. అందులో ఇచ్చిన డేటా విశ్లేషించి సమాధానాలు రాయాలి. అయితే సింప్లిఫికేషన్స్​, బేసిక్​ ఆరిథ్​మెటిక్​ ఫంక్షన్స్​ ను విరివిగా ఉపయోగించగలగాలి. వేగంగా సమాధానాలు గుర్తించేందుకు సాధనే ఏకైక మార్గం.

ప్రిపరేషన్​ : ఏ బ్యాంక్​ పరీక్షలోనైనా దాదాపు ఒకే సబ్జెక్టులు ఒకే సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిగి ఉంటాయి. కాబట్టి ఓరియంటేషన్​ మార్చి సిద్ధమైతే దాదాపు అన్ని ఎగ్జామ్స్​ రాయవచ్చు. సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వాలి. ఏ సబ్జెక్టులో  ఏ చాప్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి? వాటిలో సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపిక్స్ ఏంటి? అందులో ఉన్న స్పెషల్‍ మెథడ్స్ వంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. గంటలోపే 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేగంగా ఆన్సర్స్ రాయగలిగేలా ప్రాక్టీస్‍ చేయాలి. 

తద్వారా లాజికల్‍గా ఆలోచించడం, ఖచ్చితత్వంతో కూడిన వేగం సాధ్యమవుతుంది. సీనియర్లు, అధ్యాపకుల సలహాలు, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివ్యూలు వంటి అధ్యయనం తర్వాత పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. వీలైనన్ని ప్రీవియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‍ చేయాలి. గ్రూప్‍లుగా చదవడం వల్ల ఎక్కువ విషయాలు గుర్తుంచుకోవచ్చు. ప్రిపరేషన్​ చివర్లో అన్ని సబ్జెక్టులకు పార్ట్ టెస్టులు, గ్రాండ్‍ టెస్టులు ఆన్‍లైన్‍లో ప్రాక్టీస్‍ చేయడం వల్ల తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు ఎగ్జామ్‍ వాతావరణం అలవాటవుతుంది. ఒకేసారి ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవడం అనేది పరీక్షలో సక్సెస్‍ కు మొదటి మెట్టు.

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​లో ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్,  పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.  పూర్తి వివరాలకు www.unionbankofindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

 పంజాబ్ నేషనల్ బ్యాంక్​

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిబ్రవరి 25వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. ఖాళీలను అనుసరించి బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు ఆఫీసర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్లు

 మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 27 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​ రాతపరీక్ష మార్చి లేదా ఏప్రిల్​లో నిర్వహి స్తారు. వివరాలకు www.pnbindia.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​ : పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1లో రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (50 ప్రశ్నలు- 50 మార్కులు); పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2లో ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (50 ప్రశ్నలు- 100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగు తారు. పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలు.