
మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 99.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, బి.టెక్/ బీఈ (ఎలక్ట్రీషియన్)లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏండ్ల నుంచి 45 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 17.
లాస్ట్ డేట్: నవంబర్ 06.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.moil.nic.in వెబ్సైట్లో సంప్రదించగలరు.