ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 43 (హాస్పిటాలిటీ మానిటర్స్) .
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా బీబీఏ/ ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) లేదా బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ సైన్స్ లేదా ఎంబీఏ(టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 27 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి 17, 24, 27, మార్చి 03.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.irctc.com వెబ్సైట్ను సందర్శించండి.
