ONGCలో అప్రెంటీస్ ఉద్యోగాలు.. జీతం 12 వేలు.. టెన్త్, ఇంటర్, ఐటిఐ పాసైతే చాలు..

ONGCలో అప్రెంటీస్ ఉద్యోగాలు.. జీతం 12 వేలు.. టెన్త్, ఇంటర్, ఐటిఐ పాసైతే చాలు..

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) 2623 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 06.

పోస్టుల సంఖ్య: 2,623.

పోస్టులు: నార్తర్న్ సెక్టార్ 165, ముంబయి సెక్టార్ 569, వెస్టర్న్ సెక్టార్ 856, ఈస్టర్న్ సెక్టార్ 458, సౌతర్న్ సెక్టార్ 322, సెంట్రల్ సెక్టార్ 253.

ఎలిజిబిలిటీ
*గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: బీఏ/ బి.కాం/ బీఎస్సీ/ బీబీఏ/ బి.టెక్/బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
*మూడేండ్ల డిప్లొమా: ఏదైనా ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
*ట్రేడ్ అప్రెంటీస్: పదోతరగతి/ 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
*ట్రేడ్ అప్రెంటీస్: ఏడాది ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 
*ట్రేడ్ అప్రెంటీస్: రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. అప్లై చేసే అభ్యర్థులు 2001, నవంబర్ 06 నుంచి 2007, నవంబర్ 06 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 16.  

లాస్ట్ డేట్: నవంబర్ 06. 

సెలెక్షన్ ప్రాసెస్:  క్వాలిఫికేషన్​లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రిజల్ట్స్: 2025, నవంబర్ 26. 

 ప్రతి నెల శాలరీ: 
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: రూ.12,300.
మూడేండ్ల డిప్లొమా అప్రెంటీస్: రూ.10,900.
ట్రేడ్ అప్రెంటీస్ పదో తరగతి/ 12వ తరగతి: రూ.8200.
ట్రేడ్ అప్రెంటీస్: ఏడాది ఐటీఐ ట్రేడ్ రూ.9600.
ట్రేడ్ అప్రెంటీస్: రెండేండ్ల ఐటీఐ ట్రేడ్ రూ.10,500.

పూర్తి వివరాలకు ongcindia.com వెబ్​సైట్​లో సంప్రదించగలరు.