హైదరాబాద్, వెలుగు: రాబోయే 30 నెలల్లో దేశవ్యాప్తంగా 250 కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ప్యూర్ ఈవీ వెల్లడించింది. హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లో శుక్రవారం కొత్త షోరూమ్ ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది. తెలంగాణ మార్కెట్లో పట్టు సాధించేందుకు కంపెనీ పోలా సత్యకుమార్‌ను రాష్ట్ర డిస్ట్రిబ్యూటర్‌గా నియమించింది.
ఇక్కడ ఈ– ప్లూటో 7జీ మ్యాక్స్, ఈ– ట్రైస్ట్ ఎక్స్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. స్థానిక పరిశోధనలు, తయారీ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కృషి చేస్తోంది. నగరంలో పెరుగుతున్న గ్రీన్ ఎనర్జీ డిమాండ్‌ను ఈ షోరూమ్ తీర్చనుంది.
